1000 రోజుల కాంగ్రెస్ పాలన ప్రజల నమ్మకానికి నిదర్శనం: మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి*

September 3, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద బలం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండగా, షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేస్తున్న కృషి అభివృద్ధికి మరింత వేగం తీసుకొస్తోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి అందించడమే మా లక్ష్యం. ప్రజల ఆశీస్సులతో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తాం.”తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా షాద్‌నగర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ర్యాలీలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper