బ్రహ్మసమేథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ తుది జాబితాపై గ్రామసభ

September 3, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు 03/09/2026* ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన: కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ జాబితా తుది ప్రచురణకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియపై అధికారులు గ్రామస్తులకు వివరించారు.ఈ కార్యక్రమానికి తహసిల్దారు రవి కిరణ్, స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు హాజరయ్యారు. ఓటర్ జాబితాలో పేర్లు మిస్ అయిన వారు, కొత్తగా చేర్చాల్సిన వారి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపుతామని అధికారులు తెలిపారు. పారదర్శకంగా జాబితా తయారీకి అందరూ సహకరించాలని కోరారు.

🌐 Select Language:
📰 ePaper