టి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

September 17, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం మాజీ సర్పంచ్ రమేష్ రాజు ఆధ్వర్యంలో టి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆవరణంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేసి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబుతో పాటు కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, ఐ.పోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, దాట్ల పృథ్వి, దాట్ల పవన్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సాకా సీతాదేవి, టి.కొత్తపల్లి మాజీ సర్పంచ్ రమేష్ రాజు, జిల్లా ఎస్సీ, ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు యాళ్ల ఉదయ్, ముమ్మిడివరం తెలుగుదేశం నాయకులు భీమవరపు శ్రీనివాస్ తదితరులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper