గ్రామీణ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీజీఎస్ ఆర్ టి సి అధికారులు

June 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టీకే గంగాధర్ : టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి , డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి నేడు నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అలాగే ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని పేర్కొన్నారు.ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి టీజీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా సేవలను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను మరింత విస్తరించాలని సూచించారు.

🌐 Select Language:
📰 ePaper