గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు యూనిఫామ్ పంపిణీ
పయనించే సూర్యుడు, ఆగస్ట్ 07,అశ్వాపురం: అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం మరియు వారి విధుల నిర్వహణలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన యూనిఫాం మరియు రెయిన్ కోట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి యాకూబ్,ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు,వార్డు సభ్యులు చెట్టుపల్లి రమాదేవి, కుర్సం అనసూర్య పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేయటం జరిగింది.ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని, వారికి అవసరమైన రక్షణ సామగ్రిని అందించడం గ్రామ పంచాయతీ బాధ్యత అని గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు