ఢిల్లీ వరల్డ్ స్కూల్ లో అంబరాన్నంటిన బోనాల సంబరాలు
( పయనించే సూర్యుడు ఆగస్టు 08 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్ నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్లో ఆనందోత్సవాల మధ్య బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లాపురం అరుంధతి వెంకట్ రెడ్డి ( శ్రీ నిధి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రంగారెడ్డి , ప్రెసిడెంట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్)హాజరై వేడుకలను ప్రారంభించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించారు. బోనాల పండుగ విశిష్టత, ప్రాముఖ్యతను వివరించే ప్రసంగాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్యం, యెల్లమ్మ నృత్యం, పోతురాజుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ముఖ్య అతిథి నల్లాపురం అరుంధతి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగతులసి , వైస్ ప్రిన్సిపాల్ వెంకట కృష్ణ , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి.