యూపీహెచ్‌సీ జగద్గిరిగుట్టలో టీబీ నిర్మూలనకు అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమం

August 7, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కార్యక్రమాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో డా. ఆనంద్, డా. జ్యోతి – ప్రారంభ దశలోనే టీబీ గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన దేశాన్ని క్షయవ్యాధి (టీబీ) రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో యూపీహెచ్‌సీ జగద్గిరిగుట్టలో శుక్రవారం టీబీ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో డా. ఆనంద్ మరియు కూకట్‌పల్లి డివిజన్ డీఎంహెచ్‌వో డా. జ్యోతి సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.స్క్రీనింగ్ ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న అవగాహన కార్యక్రమాలను పరిశీలించిన అధికారులు సిబ్బంది పని తీరును అభినందించారు. టీబీ అనుమానితులను ప్రారంభ దశలోనే గుర్తించి, ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా స్క్రీనింగ్ నిర్వహించాలని, నిర్ధారణ అయిన రోగులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి చికిత్స అందిస్తూ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డా. ప్రేమామృత, ఎన్‌టీఈపీ సిబ్బంది, ఐదుగురు ఎన్‌సీసీ క్యాడెట్లు, యూపీహెచ్‌సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు టీబీ లక్షణాలు, వ్యాధి నివారణ, ఉచిత పరీక్షలు, చికిత్స సౌకర్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.అధికారుల సందర్శన, మార్గదర్శకాలు, సిబ్బందికి అందించిన ప్రోత్సాహం కార్యక్రమ విజయానికి మరింత ఊతమిచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper