ఘనంగా ప్రపంచ శ్రవణ దినోత్సవము

July 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 19/07/26 మండల కేంద్రంలోని గౌరారం కలం లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కెనడియన్ స్వరకర్త, పర్యావరణవేత్త అయిన ‘ఆర్. ముర్రే షాఫర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జూలై 18 నాడు ప్రపంచ శ్రవణ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకునే ఈ తేదీని ఎంపిక చేశారు. లక్ష్యం: నిత్యం బిజీగా ఉండే జీవితంలో కాస్త తీరిక చేసుకుని ప్రకృతి శబ్దాలను పక్షుల కిలకిలా రావాలు, గాలి శబ్దాలు, నదుల ప్రవాహం మొదలైనవి అనుభవించడం మరియు శబ్ద కాలుష్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇతరుల విషయాలను శ్రద్ధగా వినడం వల్ల కమ్యూనికేషన్ మెరుగవుతుంది,బంధాలు బలపడతాయి. మరియు ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోవచ్చనీ ప్రధానోపాధ్యాయులు రాములు అన్నారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసము 2016 లో 21 రకాల దివ్యాంగుల కేటగిరీలను గుర్తించారు. ఈ విధంగా ప్రతి కేటగిరి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు మండలానికి ఒక భవిత కేంద్రాలను, మరియు కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి దివ్యాంగులందరికీ విద్యా, ఆర్థిక, సామాజిక సౌకర్యాలు కల్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగమని, నవనీత వార్డ్ మెంబర్ దత్తు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper