తాళ్లరేవు మండలానికి 34 చెత్త సేకరణ రిక్షాల పంపిణీ

July 18, 2026 | ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి : విప్ దాట్ల సుబ్బరాజు*

పయనించే సూర్యుడు జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :తాళ్లరేవు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంజూరైన 34 చెత్త సేకరణ రిక్షాలను ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.అలాగే ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” లక్ష్య సాధనలో ప్రతి గ్రామం భాగస్వామ్యం కావాలని, పరిశుభ్రత ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సిబ్బంది, బిజెపి నాయకులు యనమండ్ర విజయకుమార్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper