జిల్లా సాగునీటి పరిస్థితులపై సమీక్ష సమావేశం

July 17, 2026 | సినిమా వార్తలు

ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు : మంత్రి నిమ్మల రామానాయుడు


ప య నించే సూర్యుడు జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :అమలా పురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సాగునీటి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్, జిల్లాలోని శాసనసభ్యులు, ప్రజాప్రతి నిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలోని ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి సమస్యలను ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా కాలువల నిర్వహణ, నీటి పంపిణీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.మంత్రి ముమ్మిడివరం నియోజక వర్గానికి సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రైతుల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు

🌐 Select Language:
📰 ePaper