వానపల్లి పశువుల ఆసుపత్రికి 15 లక్షలు విరాళందాత సత్యపళ్ళం రాజును బిజెపి యువమోర్చ నాయకుల సన్మానం
పయ నించే సూర్యుడు జూలై 17 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట మండలం, వానపల్లి,వానపల్లి ప్రభుత్వ పశువైద్యశాల నిర్మాణానికి 15 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన దాతను బిజెపి యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు దుశ్శాలువాలతో సన్మానించారు.కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన బండారు సాయన్న, సుందరమణి దంపతుల జ్యేష్ఠ కుమారుడు సత్యపళ్ళం రాజు ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఐటి ఉద్యోగం చేస్తున్నారు. తను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో దేశానికి వెన్నెముక అయిన రైతు, రైతుకు సహాయపడే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలని, పశువులు, మూగజీవాలకు వైద్యం అందించేందుకు పశువైద్యశాల నిర్మాణానికి సుమారు 15 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.ఈ విరాళాన్ని శాసనసభ్యులు బండారు సత్యానంద రావు ఇటీవల వానపల్లిలో పశువుల ఆసుపత్రి నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో అందజేశారు.వానపల్లి మరియు చుట్టుపక్కల లంక గ్రామాల్లోని పశువులకు, పాడి రైతులకు ఈ ఆసుపత్రి ఎంతో మేలు చేకూర్చనుంది. పుట్టిన గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తున్న సత్యపళ్ళం రాజు లాంటి వారు యువతకు ఆదర్శమని బిజెపి నాయకులు కొనియాడారు. సత్యపళ్ళం రాజు మరింత ఉన్నతంగా ఎదిగి భవిష్యత్తులో గ్రామానికి, దేశానికి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, బిజెపి యువమోర్చ రాష్ట్ర కార్యదర్శి పాలూరి జయప్రకాశ్ నారాయణ, కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొలకోటి వెంకటేశ్వరావు, బిజెపి ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దిశెట్టి శ్రీనివాస్, బిజెపి కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు కోటిపల్లి రఘురాం వేణుగోపాల్, బిజెపి యువమోర్చ జిల్లా కార్యదర్శి వలపశెట్టి కిరణ్, బిజెపి ఓబీసీ మోర్చా నాయకులు ఇళ్ల పల్లంశెట్టి, బిజెపి ఎస్సీ మోర్చా నాయకులు బళ్ల మూలాస్వామి, బిజెపి నాయకులు నల్లా వరప్రసాద్, యూత్ నాయకులు బండారు మధు, అడబాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.