షాద్నగర్ లో ఈనెల 19న తెలంగాణ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

July 17, 2026 | సినిమా వార్తలు

తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి

టీజేఏసీ చైర్మన్ మూలె జనార్ధన్

( పయనించే సూర్యుడు జూలై 18షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం, మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) షాద్‌నగర్ తాలూకా కమిటీ వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు టీజేఏసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ మూలె జనార్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను భావితరాలకు చాటిచెప్పే చిరస్మరణీయ చిహ్నంగా ఈ అమరవీరుల స్థూపం నిలుస్తుందని అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమానికి, సమాజాభివృద్ధికి విశేష సేవలందించిన మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కూడా చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర జేఏసీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం, విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్ శ్రీమతి వెన్నెల గద్దర్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి శంకరమ్మ, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్, భీశ్వ కిష్టయ్య, చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.తెలంగాణ ఉద్యమకారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, విద్యావంతులు, మేధావులు, తెలంగాణవాదులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మూలె జనార్ధన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీజేఏసీ వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్, జేఏసీ కన్వీనర్ నక్క బాల్‌రాజ్ యాదవ్, ట్రెజరర్ గోర్ల రాము, మందారం నరసింహులు, భీశ్వ కృష్ణయ్య, అర్జునప్ప, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీ ఖాన్ బాబర్, ఆదివాసీ గిరిజన రాష్ట్ర నాయకులు పి. రఘునాయక్, బాదేపల్లి సిద్ధార్థ, జాంగారి రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper