PS Telugu News
Epaper

డ్రైనేజీల్లో షిల్టు తొలగింపు

📅 29 Apr 2026 ⏱️ 1:19 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేని కోన మండలం కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన షిల్టును గత నాలుగు రోజులుగా ప్రత్యేక కార్మికులతోతొలగిస్తున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా షెల్టును తొలగిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి జే వి వి సత్యనారాయణ తెలిపారు. గ్రామంలోని డ్రైనేజీ సౌకర్యం ఉన్న ప్రజానీకం డ్రైనేజీలను సక్రమ పద్ధతిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. కొబ్బరి బొండాలు, ఇతర చెత్తాచెదారం వేయడం వల్ల నీరు సక్రమంగా ప్రవహించదని, తరచూ పూడికలు ఏర్పడతాయని ఆయన అన్నారు.

Scroll to Top