నిజాంబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సీతక్క టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

పయనించే సూర్యుడు 29 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సునీల్ రెడ్డి మేయర్ ఉమారాణి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా కార్యాలయం నిర్మాణం జరగడం ద్వారా ప్రజలకు మరింత సమీపంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, ఈ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రంగా మారుతుందని అన్నారు.మంత్రి సీతక్క, మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ బలపాటుకు కార్యాలయాల నిర్మాణం అవసరమని, నిజామాబాద్‌లో నిర్మించబడుతున్న ఈ భవనం కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజా పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత సేవలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాట్లాడుతూరాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్‌లో కొత్త కార్యాలయం నిర్మాణం పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకువస్తుందని, కార్యకర్తల సమన్వయానికి ఇది కీలక కేంద్రంగా మారుతుందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఉత్సాహభరిత హాజరుతో విజయవంతంగా ముగిసింది.