తానూర్‌లో ఘనంగా సామాజిక విప్లవకారుడు అన్నాభావు సాఠే వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

July 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి:తానూర్, జూలై 18:నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో శనివారం మహాకవి, సామాజిక విప్లవకారుడు డాక్టర్ అన్నాభావు సాఠే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు ఆధ్వర్యంలో, తానూర్ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ కలిసి అన్నాభావు సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, కార్మికుల హక్కుల కోసం అన్నాభావు సాఠే చేసిన కృషి అనన్యసామాన్యమైనదని కొనియాడారు. ఆయన తన రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తానూర్ కమిటీ సభ్యులు, ఉద్గిరె దత్తు, బైల్కర్ సురేష్, వాగ్మరే సాయజీ, స్థానిక నాయకులు మరియు వాగ్మరే ప్రసాద్,వాగ్మరే అమృత్ గైక్వాడ్ రవి గైక్వాడ్ నాగేష్ వాగ్మేరే మణికంఠ ,వాగ్మారే పోతన్ బోయవార్ సాహెబు గైక్వాడ్ సాయినాథ్ ఝరి,గ్రామస్తులు సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper