పడకేసిన పారుశుద్ధం సరిపడా మూత్రశాలలు మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థినిలు చోద్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం

July 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఈరోజు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది….ఈ సందర్భంగా శీతల్కర్ అరవింద్ & నవీన్ మాట్లాడుతూ :జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు, బాలురకు తగిన మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకొని అవసరమైన చోట కొత్త మరుగుదొడ్లు నిర్మించేల చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది అన్నారు తేదీ 30-06-2026న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం, నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 250 మంది విద్యార్థినులకు కేవలం ఒకే ఒక్క బాత్రూమ్ మాత్రమే ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రూమ్‌లలో తలుపులు లేకపోవడం, కనీస గోప్యత లేకపోవడం వల్ల విద్యార్థినులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొనడం అత్యంత బాధాకరం. ఇది విద్యార్థుల గౌరవాన్ని, ఆరోగ్యాన్ని, విద్యా హక్కును దెబ్బతీసే పరిస్థితి.ఈ సమస్య ఒక్క పాఠశాలకు మాత్రమే పరిమితం కాలేదు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు, బాలురకు తగిన సంఖ్యలో మరుగుదొడ్లు లేకపోవడం, ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థలో ఉండటం, నీటి సౌకర్యం లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బాలికలు ప్రతి నెల రుతుక్రమ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కొందరు పాఠశాలకు హాజరుకావడానికే వెనుకంజ వేస్తున్నారు.”మన ఊరు – మన బడి” పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులకు అత్యంత అవసరమైన మరుగుదొడ్ల వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంలో విఫలం కావడం బాధాకరం. ఇది విద్యార్థుల గౌరవాన్ని కాపాడడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం.అందువల్ల జిల్లా విద్యాశాఖ వెంటనే స్పందించి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, మరుగుదొడ్ల కొరత ఉన్న పాఠశాలలను గుర్తించి అత్యవసరంగా కొత్త మరుగుదొడ్లు నిర్మించాలి. పాడైన మరుగుదొడ్లను మరమ్మతులు చేసి, తాగునీరు, పరిశుభ్రత, నిర్వహణకు శాశ్వత చర్యలు చేపట్టాలి.మా డిమాండ్లు:జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సర్వే నిర్వహించాలి.బాలికలు, బాలురకు వేర్వేరుగా తగిన సంఖ్యలో మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలి.పాడైన మరుగుదొడ్లను అత్యవసరంగా మరమ్మతులు చేయాలి.ప్రతి పాఠశాలలో నీరు, పరిశుభ్రత, శానిటేషన్ సౌకర్యాలు కల్పించాలి.నిర్లక్ష్యం చేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని, ఈ సమస్య పునరావృతం కాకుండా శాశ్వత కార్యాచరణ రూపొందించాలి.లేనిపక్షంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చాత్ర యువ సంఘర్ష సమితి (సి వై ఎస్ ఎస్) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఈ సందర్భంగా చాత్ర యువ సంఘర్ష సమితి (సి వై ఎస్ ఎస్)శీతల్కర్ అరవింద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్..యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నవీన్ తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper