రానున్న వర్షాకాలంలో విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై కృష్ణయ్య

July 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ | జూలై 2 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: శ్రీనివాస్ రెడ్డి : రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణయ్య సూచించారు. గ్రామాలు, పంట పొలాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల సమీపానికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో లేదా వర్షం ఆగిన వెంటనే విద్యుత్ స్తంభాల వద్ద నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నందున విద్యుదాఘాత ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు విద్యుత్ స్తంభాలకు ఆనుకుని నిలబడకుండా జాగ్రత్త వహించాలని, ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మరమ్మతులు, భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్సై కృష్ణయ్య కోరారు. ప్రజల ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని, ముందస్తు అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.భారీ వర్షాల సమయంలో అధికారులు జారీ చేసే సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఆలస్యం చేయకుండా పోలీసు శాఖ లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఎస్సై కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper