బూర్గుల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం

June 17, 2026 | తెలంగాణ

ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి

పాల్గొన్న వార్డ్ సభ్యులు మరియు ఉపాధ్యాయులు

( పయనించే సూర్యుడు జూన్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం బూరుగుల గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజు అక్షరభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అకాడమీ సంవత్సరంలో 20 మంది కొత్త విద్యార్థులు అడ్మిషన్ పొందడం జరిగింది. కావున పాఠశాల సిబ్బంది ఈ సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో కొత్తగా అడ్మిషన్లు అవడం చాలా సంతోషకరమని ప్రైవేట్ పాఠశాలల దీటుగా గవర్నమెంట్ పాఠశాలలు పనిచేయాలని సూచించారు. పాఠశాలకు ఇలాంటి సౌకర్యాలు కావాలన్నా కల్పిస్తామని ఉన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి తో పాటు ఉపసర్పంచ్ శివలీల వార్డ్ సభ్యులు రాజేందర్ కవితా సత్యనారాయణ స్వప్న తేజ రాము పవన్ కుమార్ సంతోష్ కుమార్ గౌడ్ హరీశ్వర్ శేఖర్ జంగమ్మ జంగయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయురాలు మరియు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper