భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు ఎస్ ఎఫ్ ఐ)నిర్మల్ జిల్లా కమిటీ

June 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ ఫీజులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల వ్యాపారాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి (యు ఎస్ ఎఫ్ ఐ)నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు ఎస్ ఎఫ్ ఐ) జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ, అనేక పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలను తమ పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు కొనసాగుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, డెవలప్‌మెంట్ ఫీజులు, యాక్టివిటీ ఫీజులు పేర్లతో వేలాది రూపాయలు వసూలు చేస్తూ మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నారు. కొందరు పాఠశాలలు ముందస్తు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల కోసం అదనపు చెల్లింపులు కూడా డిమాండ్ చేస్తున్నాయనే ఫిర్యాదులు వెలువడుతున్నాయి.జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి నిర్మల్ జిల్లాలోని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.విద్య అనేది వ్యాపారం కాదు, ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే ప్రాథమిక హక్కు. విద్యను లాభదాయక వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోపిడీ చేసే విద్యాసంస్థలను ప్రభుత్వం కఠినంగా నియంత్రించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి (యు ఎస్ ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నామత్కర్ నవీన్ హెచ్చరించారు.

🌐 Select Language:
📰 ePaper