భైంసా పట్టణంలోని కమల జినింగ్ ఫ్యాక్టరీలో రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు రైతులు సంబరాలు

July 1, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: రైతు భరోసా సంబరాలు..ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారం భైంసా లోని కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , pcc చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కు ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం జరిగింది .ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రే , ముధోల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ షఫీ , లోకేశ్వరం మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి , జిల్లా కార్యదర్శి జెడి రామ్ ,మతీన్ , జాఫర్ ,జీ సాయి , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper