పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై బిజెపి గుంటూరు జిల్లా ఇంచార్జ్ యళ్ల దొరబాబు హర్షం
పయనించే సూర్యుడు జూలై 1 ముమ్మిడివరం ప్రతినిధి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజారంజక నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా ఇంచార్జ్ యళ్ల వెంకట రామమోహనరావు దొరబాబు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం అభినందనీయమని అన్నారు. ఈ నిర్ణయంతో రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల దేశంలోని కోట్లాది మంది సామాన్యులు, వాహనదారులు, రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అభివృద్ధి, ప్రజా సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు స్వాగతిస్తున్నారని దొరబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ ముడిచమురు ధరల్లో మార్పులు ఉన్నా, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఇంధన శాఖ మంత్రికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.