కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
అన్నారం కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన రాయికల్ శ్రీనివాస్
కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ లావణ్య రామక్రిష్ణ
( పయనించే సూర్యుడు జూలై 26 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులైన జావాజీ అనిత మరియు సనుగుముల్లా వినోద కు కళ్యాణ లక్ష్మి చెక్కులను షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అదే విధంగా ఫరూక్నగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ చేతుల మీదుగా కూడా చెక్కులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ మరియు అన్నారం సర్పంచ్ లావణ్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.