రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది
పయనించే సూర్యుడు 17 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో TGEJAC రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రం లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది TGEJAC ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైనారు..నాలుగు ప్రధాన డిమాండ్లపై మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేస్తూ ఈ క్రింది ప్రధాన డిమాండ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
1, రెండో పి ఆర్ సి కమిషన్ పొడిగించకుండా కాలయాపన లేకుండా జూన్ 2, 2026 లోపు అమలుపర్చాలి
2, ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు,రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు 13 వేల కోట్లు వెంటనే విడుదల చేసి ఏక మొత్తంలో చెల్లించాలి 3, గత చాలా కాలం నుండి ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న హెల్త్ కార్డులను వెంటనే అమలుపరచాలి 4,CPS కంట్రిబూషనల్ పెన్షనర్ స్కీమ్ ను రద్దు పరచి OPS ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలుపర్చాలి పైన తెలిపిన నాలుగు ప్రధాన డిమాండ్లతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా మిగిలియున్న 64 అంశాలను వెంటనే అమలుపరచాలి ఈ కార్యక్రమంలో TGO, ఎంపీడీఓ ల సంఘం రాష్ట్ర నాయకులు గంగుల సంతోష్ కుమార్, Dy తహసీల్దార్ శ్రీనివాస్, కమీషనర్ గంగాధర్ TNGO నాయకులు.సృజన్కుమార్,తిరుపతి, శ్రీనివాస్ PRTU మండలాధ్యక్షు డు ఎడ్ల శేఖర్,కార్యదర్శి కర్నాల శ్రీనివాస్ UTF బాధ్యాలు మల్లేష్, డిటిఎఫ్ బాధ్యులు జాన్విల్సన్, ఈశ్వర్ TPUS బాధ్యులు రమణ, భూమేశ్వర్, PGHM రమేష్ ,నాయకులు ప్రిన్స్, నరేష్, చంద్ర శేఖర్ తదితరులు పాలుగొన్నారు….
