.ఘనంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వారిమధ్య బుచ్చి రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆశీస్సులతో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. తదనంతరం పలువురు బుచ్చిరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారపల్లి రవీందర్ చిందం రవి కొమ్ముల సదానందం డిటి రెడ్డి మైలారం ఉపసర్పంచ్ మసికే కుమారస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు అరికెళ్ల సుధాకర్, నాయకులు మామిడిపల్లి సాంబయ్య, గొర్రె కుమారస్వామి, ఏనుగుల అశోక్, అరికిళ్ల రవి, అనిల్, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..