PS Telugu News
Epaper

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్

📅 20 Apr 2026 ⏱️ 6:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పాఠశాలలను తనిఖీ చేసిన కడియాల కుంట తండా పాలకవర్గం

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ

ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్

(పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని బూరుగడ్డ తండాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజు ప్రణాళికలో భాగంగా సోమవారం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మధ్యాహ్నం భోజనం కార్యక్రమం తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఏ విధమైన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని కడియాల కుంట తండా పాలకవర్గం సోమవారం నాడు తనిఖీలు చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మరియు మంచినీరు క్రమం తప్పకుండా అందించాలని పాలకవర్గం సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జంగయ్య, సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పతంజలి మరియు కడియాల కుంట తండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ మరియు ఉప సర్పంచ్ తావు సింగ్ నాయక్ వార్డ్ సభ్యులు తావు సింగ్, చాట్ పట రవీందర్ నాయక్, ప్రియాంక దేవేందర్ నాయక్, దేవి రవి నాయక్, నీలా భాస్కర్ నాయక్, గోపి నాయక్, జ్యోతి రాజు నాయక్, ఏఎంసి చైర్మన్ మన్ని తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top