వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి – బీజేవైఎమ్ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళన అవగాహన

పయ నించే సూర్యుడు సెప్టెంబర్ 1 2ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ – బీజేవైఎమ్ గోదావరి జోన్ ఇన్ చార్జ్ ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా భారతి విభాగ్ సేవా సంపర్క్ ప్రముఖ్ పాల్గొని స్వామి వివేకానంద చికాగో సర్వమత సమ్మేళన సభలో పాల్గొని భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేశారని, అమెరికా వెళ్లిన తర్వాత భారతదేశంపై అమెరికన్లకు ఉన్న అభిప్రాయం మారడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలియజేశారు. స్వామి వివేకానందపై అభిమానంతో పూర్తి-పరిమాణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మొదటి అమెరికా నగరం సియాటెల్ అని, ఈ విగ్రహాన్ని 11 ఏప్రిల్ 2026న వెస్ట్ లేక్ స్క్వేర్ లో ఆవిష్కరించారని తెలియజేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో నేటి యువత దేశ భవిష్యత్తులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కళాశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారాయుడు మాట్లాడుతూ స్వామి వివేకానంద బాల్య విశేషాలను తెలియజేశారు. వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు (బాబీ మాస్టర్) మాట్లాడుతూ సమాజంలో తాము సేవ చేయడానికి స్ఫూర్తి స్వామి వివేకానంద అని, నేటి విద్యార్థులందరూ సమాజ సేవలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.