కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల అందజేత

July 25, 2026 | సినిమా వార్తలు

( పయనించే సూర్యుడు జూలై 25 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబుర్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు నల్లమోని శ్రీధర్, 18వ వార్డు కౌన్సిలర్ సంతోషి చందులాల్ చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు నేరెళ్ల సుమిత్ర, ఖురేషి మహమ్మద్ హసీనా, గన్నోజు సరళ, జంగం శ్రీకళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముబారక్, దిలీప్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగిడిపల్లి శంకర్, గ్రంథాలయ జాయింట్ ట్రెజరర్ కత్తి చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు.. KP

🌐 Select Language:
📰 ePaper