శ్మశానంలో అస్థికల చోరీ ఘటన- లాకర్ పగలగొట్టి అస్థికలు అపహరణ
పయనించే సూర్యుడు న్యూస్ :హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా శ్మశానవాటికలో దుండగులు, అక్కడ లాకర్లను పగులగొట్టారు. అందులో ఓ వృద్ధురాలి అస్థికలను ఎతుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోలన్ జిల్లాలోని చంబాఘాట్ శ్మశానవాటిక ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అస్థికలు భద్రపరిచే గది వైపు వెళ్లారు. అక్కడ ఉన్న ఒక లాకర్ తాళాన్ని పగులగొట్టారు. లోపల ఉన్న అస్థికల కుండను అపహరించారు. […]




