సూళ్లూరుపేట తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో చెత్త వ్యర్ధాలు

July 28, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు జూలై 28 (సూళ్లూరు పేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్లూరుపేటనియోజకవర్గం హెడ్ కోటర్ అయినటువంటి సూళ్లూరుపేట తాసిల్దారు‌ కార్యాలయంలో ఎటు చూసినా అశుభ్రత చెత్త వ్యర్ధాలు పరిసరాలలో పూర్తిగా మంగళ షాపు కటింగ్ వెంట్రుకలమయంగా ఉండడం ఒకవైపు అయితే మరోవైపు పాత కట్టడాలు ఏ క్షణంలో అయినా కూలిపోయే పరిస్థితులలో ఉంది ఈ ప్రదేశం ఇలా అపరివి శుభ్రంగా ఉండడం అధికారులకు కనబడుతుందో లేదో? ఒకపక్క ప్రజలకు పరిశుభ్రం గురించి అవగాహన కల్పిస్తూ చెత్త వేయరాదు ఎక్కడపడితే అక్కడ అని ప్రభుత్వ అధికారులు ప్రచారం చేస్తున్నారు కానీ సూళ్లూరుపేట తాసిల్దార్ ఆఫీస్ కి వచ్చి పోయే ప్రజలు మాత్రం ఇలాంటి ఆఫీసును చూసి ఆశ్చర్య పోతున్నారు ఆఫీసు ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకొనుటకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కరువైందా అని ప్రజలు నవ్వు కుంటున్నారు ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి కార్యాలయం ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు

🌐 Select Language:
📰 ePaper