ePaper

జిల్లా స్తాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో గాంధారి క్రీడాకారిణి బంగారుపతకం

May 7, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు గాంధారి 08/05/26 కామారెడ్డి జిల్లా స్తాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ 60 మీటర్ పరుగు పందెం లో మండలంలోని సోమారం తాండా కు చెందిన సాయి చెల్సియా రాథోడ్ బంగారు పతకం సాధించినట్లు ఆమె తండ్రి వాలీబాల్ కోచ్ లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రాల్లోని ఇందిరా గాంధీ క్రీడమైదనంలో జరిగిన పోటీల్లో 10 సెకన్లలో పరుగు పందెం పూర్తి చెసినట్లు ఆయన తెలిపారు. గెలుపొందిన ఆమెకు జిల్లా అథ్లెక్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ పేట జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ బహుమతి ప్రధానం చేశారు.