1 కోటి 9 లక్షల రూపాయలతో ముమ్మిడివరం నగర పంచాయతీలలో సిసి రోడ్లు ప్రారంభోత్సవాలు

పయనించే సూర్యుడు మే 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో కార్యక్రమాలు ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మరియు పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలలో సిసి రోడ్లు ప్రారంభోత్సవాలు 1, 2,3,5,6,8, 11,15,16,19,20 వార్డుల నందు నూతనంగా వేయబడిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు 1 కోటి 9 లక్షల రూపాయలతో సిసి రోడ్లు వేయడం జరిగిందని మరియు నూతనంగా కొత్తగా వేయబడే రోడ్లకు శంకుస్థాపనలు ఈరోజు చేయడం జరిగిందని అన్నారు. తాడి నరసింహారావు గారి ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో బుచ్చిబాబు మాట్లాడుతూ ముమ్మిడివరం నగర పంచాయతీని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలతో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో సిసి రోడ్లు ప్రారంభోత్సవం ఈరోజు చేశామని అలాగే నూతనముగా కొత్తగా వేయబడే రోడ్లకు శంకుస్థాపనలు ఈరోజు చేసామని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు రోడ్డు మార్గము కొరకు టి టి ఆర్ నగర్ నుండి హైవే రోడ్డు వరకు సుమారు 18 సెంట్లు సైట్ ని రోడ్డు మార్గము కొరకు తాడి నరసింహారావు తాడి జానకిరామ్ ఉచితంగా రోడ్డు మార్గం ఇవ్వడం జరిగినందున స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి ముగ్గురు తాడి సోదరులను అభినందించారు. నగర పంచాయతీ పరిధిలో డ్రింకింగ్ వాటర్ శాశ్వత పరిష్కారానికి ఇంటింటికి కులాయి పథకంలో 160 కోట్లు ప్రధానమంత్రి జల్జీవన్ పథకం నుండి గ్రాంట్ శాంక్షన్ అయ్యింది టెండర్ కూడా ఖరారు అయినది అని అన్నారు. ఓఎన్జిసి నిధుల నుండి కోటి రూపాయలు వాకింగ్ ట్రాక్ మరియు చిల్డ్రన్ పార్క్ కొరకు శాంక్షన్ అయ్యి టెండర్ ఖరారు అయినది త్వరలోనే పనులు ప్రారంభిస్తారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, దాట్ల పృథ్వీరాజ్, దొమ్మేటి రమణ కుమార్,ములపర్తి బాలకృష్ణ, నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ, గొల్లపల్లి ధర్మారావు,గొల్లపల్లి గోపి, సరిపెల్ల శ్రీను రాజు, చిక్కాల అంజిబాబు, ఏళ్ల ఉదయ్, సురేష్ వర్మ, మాదాల బుజ్జి, కడలి నాగు, పిల్లి నాగరాజు, అడబాల సతీష్, దాట్ల బాబు,నిమ్మకాయల విషు, విళ్ళ వీరస్వామి నాయుడు, బొబ్బిలి, దివి విజయ్, రెడ్డి సుబ్బారావు, రెడ్డి శ్రీను,బొక్కా రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, అత్తిలి ప్రసన్నకుమారి, కంచర్ల సురేష్, నాని సాన బోయిన సోమయ్య, ఎస్ఎంఎస్ ప్రసాద్, జాగూ సత్తిబాబు, కాకి మాణిక్యం, కాశి లాజర్, నీతి పూడి వంశీ,ఏడిదశివ, ఏడిద సుధీర్,చింతలపూడి బాబురావు, మాదాల పరంకుశం, రామాయణం రాజు, సాన బోయిన నానాజీ, బూరుగు కళ్యాణ్, దాసు, దంగేటి శ్రీను, జెడి,మొదలగు వారు పాల్గొన్నారు.