ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ప్రజా దర్బార్)
పయ నించే సూర్యుడు మే 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహణ ఈరోజు మురమళ్ళలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( ప్రజా దర్బార్) కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు.శాసనసభ్యుల వారు అర్జీలను పరిశీలించి, తక్షణం పరిష్కరించగలిగిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరిన్ని సమస్యలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మురమళ్ళ లో ప్రజా ధర్భార్… సమస్యలు పై స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ఏ కార్యక్రమం లో కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తులు సాయి, సాగిరాజు సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.