ఘనంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు…
గజమాలతో నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూళ్ళూరి బ్రహ్మయ్య.
పయనించే సూర్యుడు, మే 28, అశ్వాపురం: తెలుగువాడి గుండె గుడిలో కొలువైన ఆరాధ్య దైవం, వెండితెరపై నవరస నటనా సార్వభౌముడు, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన యుగపురుషుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103 వ జయంతి వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూళ్ళూరి బ్రహ్మయ్య ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే అధికార పీఠాన్ని అధిష్టించి, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అపూర్వ రికార్డు సృష్టించిన మొనగాడు మన అన్నా రామన్న. సామాజిక న్యాయంతో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన పేదల పక్షపాతి ఆయన. ఎన్టీఆర్ గారికి సాటి రాగల నాయకులు రారు, రాలేరు, రాబోరు అనేది చరిత్ర చాటిచెప్పిన సత్యం అని కొనియాడారు.ఈ యొక్క కార్యక్రమంలో అశ్వాపురం పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ లు బానోత్ సదర్ లాల్ మరియు తూళ్ళూరి ప్రకాష్ రావు, తూళ్ళూరి గంగా భవాని, ముత్తినేని సుజాత,జజ్జవరపు శ్రీనివాస్,ముత్తినేని శ్రీనివాస్, రాయల రమేష్,పాకలపాటి వెంకటేశ్వరావు,నర్రా సంపత్ వీరితో పాటు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అన్న రామన్న స్మరణతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.