ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశము
పయనించే సూర్యుడు మే 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం శ్రీ వాసవి ఫంక్షన్ హాల్ నందు జరిగింది ఈ సందర్భంగా అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ డీఎల్ఎన్ శర్మ ఈ సమావేశంలో పాల్గొని ఎంతో సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను వినియోగించు కోవాలని వివిధ ప్రాంతాలలో గల దేవాలయాలను సందర్శించడం కొరకు, వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు వినియోగించుకొని సురక్షిత ప్రయాణం సాగించాలని ఆయన తెలిపారు అనంతరం ఇటీవల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు డిపో నందు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకై మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి రోజు వందలాదిమంది ప్రయాణికుల దాహార్తిని తీర్చిన సందర్భంగా ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు, కార్యదర్శి నూలు సూరిబాబు, ముఖ్య సలహాదారు నంబూరి విశ్వనాథం, కార్యవర్గ సభ్యులు నంబూరి శ్రీనివాస్, గ్రంధి గుప్తా, పచ్చిగోళ్ళ నర్సిబాబుకు డిఎం అందించారు, అంతకుముందు అమలాపురం ఆదర్శ హాస్పిటల్ డాక్టర్ వి ఎల్ ఎన్ దీక్షితుల శ్రీనివాస్ షుగర్ వ్యాధి లక్షణాలు, నివారణ అనే అంశంపై సుదీర్ఘముగా ఆయన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులకు తెలియజేశారు సభ్యుల సందేహాలను ఆయన తీర్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, ఆర్టిసి డిపో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఓ ప్రతిమాకుమారి ఓపిఆర్ఎస్ఎల్ఓ ఎన్ వరహాల బాబు, ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మహిళా విభాగం సభ్యులు కూడా పాల్గొన్నారు.