ముమ్మిడివరం నియోజక వర్గంలో పండగ వాతావరణంలో మహానాడు 2026- భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
పయనించే సూర్యుడు మే 27 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డిజిటల్ మహానాడుతో తెలుగుదేశం పార్టీ శక్తి మరోసారి నిరూపితంముమ్మిడివరం నియోజకవర్గంలో మహానాడు–2026 కార్యక్రమాలు పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడును విజయవంతం చేశారు.ముందుగా ఐ.పోలవరం మండలం మురుమళ్ల గ్రామంలోని 6వ క్లస్టర్ పరిధిలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నగర పంచాయతీ పరిధిలోని 3వ క్లస్టర్ సభా వేదిక వద్దకు చేరుకొని అక్కడ కూడా పార్టీ జెండా ఆవిష్కరించి, పార్టీ నియమించిన పరిశీలకులు సుంకర పావని తో కలిసి వర్చువల్ మహానాడులో పాల్గొన్నారు.తదుపరి చిన్న కొత్తలంక గ్రామంలోని 2వ క్లస్టర్ పరిధిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. తదుపరి 4 వ క్లస్టర్ పరిధిలో సభా వేదిక వద్దకు చేరుకొని అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.అనంతరం 1వ క్లస్టర్ పరిధిలోని వీ కన్వెన్షన్ సభా వేదిక వద్దకు చేరుకొని మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడ మహిళలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.తదుపరి తాళ్లరేవు మండలం పరిధిలో 8వ క్లస్టర్‌లో నిర్వహించిన మహానాడు సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ…“తెలుగువారికి మహానాడు అనేది ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు, అది ఒక పండుగ. ఈరోజు డిజిటల్ రూపంలో నిర్వహించిన మహానాడులో కూడా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొనడం తెలుగుదేశం పార్టీకి ఉన్న అపారమైన ప్రజాబలం, క్యాడర్ బలం, నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పింది” అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, యువనేత విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ డిజిటల్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని తెలిపారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరిని అనుసంధానించే విధంగా మహానాడు నిర్వహణ ఉండటం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు.యువగళంతో యువతలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిన లోకేష్ గారు, సాంకేతికతను వినియోగించి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ యువశక్తికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్‌లో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొనగా, కార్యక్రమ నిర్వాహకులు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో , డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి . టిడిపి యువ నాయకులు దాట్ల పృథ్వీరాజ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు , ఎక్స్ ఎమ్మెల్యే చెల్లు వివేకానంద ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అశోక్, సాగిరాజు సాయిరాజు, గొల్లపల్లి గోపి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.