సూళ్ళూరుపేట ఈద్గాలో ప్రశాంతంగా బక్రీద్ నమాజ్: భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ

May 28, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు మే 28 (సూళ్లూరుపేట నియోజక వర్గం రిపోర్టర్ దాసు)​సూళ్ళూరుపేట : తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణ పరిధిలోని మాన్నారుపోలూరు ఈద్గా మైదానంలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ పండుగ సందర్భంగా సూళ్ళూరుపేట, తడ మరియు వాటి పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన సుమారు 2000 మంది ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో ఒకేచోట చేరి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. అనంతరం సమాజంలో శాంతిసౌభాగ్యాలు వర్ధిల్లాలని ప్రార్థిస్తూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా మరియు అల్లర్లకు తావులేకుండా సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు​ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ సూళ్ళూరుపేట, తడ పరిసర ప్రాంతాలలో బక్రీద్ పండుగ ప్రార్థనలు జరుగుతున్న అన్ని ప్రదేశాలలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల గట్టి జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు సిబ్బందిని వ్యూహాత్మకంగా రంగంలోకి దించామని, ప్రతి ఒక్కరూ పండుగను సోదరభావంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన కోరారు. ఎవరైనా సమాజం లో శాంతికి విఘాతం కలిగిస్తూ గొడవలు సృష్టించాలని చూసినా, లేదా అల్లర్లకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గట్టిగా హెచ్చరించారు. పట్టణ ప్రముఖులు, ముస్లిం మత పెద్దల సహకారంతో మరియు పోలీస్ శాఖ తీసుకున్న ముందస్తు భద్రతా చర్యల వల్ల ఎక్కడా ఎలాంటి చిన్న సంఘటన కూడా చోటు చేసుకోకుండా బక్రీద్ పండుగ ప్రార్థనలు అత్యంత విజయవంతంగా, ప్రశాంతంగా ముగిశాయని సీఐ మురళీకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper