అశ్వాపురం గ్రామ పంచాయతీ నూతన భవనం మరియు ట్రాక్టర్ మంజూరుకై జాయింట్ కలెక్టర్ కి విన్నపం

May 11, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు, మే 11, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా, అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్, జిల్లా జాయింట్ కలెక్టర్ వేణు గోపాల్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణానికి స్థల కేటాయింపు మరియు పారిశుద్ధ్య పనుల నిమిత్తం కొత్త ట్రాక్టర్ కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు. శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత పంచాయతీ భవనం గురించి. అశ్వాపురం గ్రామ పంచాయతీ భవనం 1970లో అప్పటి హోం శాఖ మంత్రివర్యులు జలగం వెంగళరావు చేతుల మీదుగా నిర్మించబడింది. 55 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుందని, స్లాబ్ పెచ్చులు ఊడి పడు తుండటంతో సిబ్బంది మరియు ప్రజలు ప్రాణభయంతో గడుపుతున్నారని సర్పంచ్ వివరించారు. గ్రామ జనాభా 20,000 దాటిన నేపథ్యంలో, పాత భవనంలోని చిన్న గదులు పాలకవర్గ సభ్యులు 16 మంది వార్డు సభ్యులు, మరియు 4 గురు ఎం.పి.టి.సిలు, ఎం.పి.పి మరియు 22 మంది సిబ్బందికి ఏమాత్రం సరిపోవడం లేదని పేర్కొన్నారు.స్థల ప్రతిపాదనలు.. నూతన భవన నిర్మాణానికి గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని కోరారు.ఆర్ & బి ఆఫీస్ ఆవరణ (3 ఎకరాలు), ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ (4 ఎకరాలు), వెటర్నరీ హాస్పిటల్ ఆవరణ (1/2 ఎకరం) ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆవరణ (4 కుంటలు) *పారిశుద్ధ్య సమస్య కొరకు*మేజర్ గ్రామ పంచాయతీ అయిన అశ్వాపురంలో ప్రస్తుతం ఉన్న ఒక్క ట్రాక్టర్ ఇంటింటి చెత్త సేకరణకు సరిపోవడం లేదని, గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే అదనంగా మరో ట్రాక్టర్ కొనుగోలుకు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరారు. సర్పంచ్ అందించిన వినతిపత్రంపై జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. భవన పరిస్థితి మరియు స్థల లభ్యతపై నివేదిక కోరి, త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

📰 ePaper