శేరిలింగంపల్లి అభివృద్ధికి రూ.2,000 కోట్ల మంజూరు.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చిరుమర్తి రాజు కృతజ్ఞతలు
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 9 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు చిరుమర్తి రాజు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధినే ధ్యేయంగా చేసుకుని నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ఖాతాల కమిటీ (పీఏసీ) చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సేవలను చిరుమర్తి రాజు కొనియాడారు. అభివృద్ధి పనుల సాధనలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా గుర్తింపు పొందిన పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీకి చిరుమర్తి రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు.