ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం

June 9, 2026 | తెలంగాణ

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రగతి స్కాలర్‌షిప్ ద్వారా ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం*

( పయనించే సూర్యుడు జూన్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు గ్రామీణ ప్రగతి స్కాలర్‌షిప్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ గ్రామీణ ప్రగతి స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఈ ఏడాది గ్రామీణ ప్రగతి స్కాలర్‌షిప్ ద్వారా 26 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుండి వారు ఎంచుకున్న ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.1 లక్ష వరకు ఆర్థిక సహాయం అందించ నున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో స్కాలర్‌షిప్ లక్ష్యాలు, విద్యార్థుల బాధ్యతలు, ఉన్నత విద్యలో లభించే అవకాశాలు, కెరీర్ అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగేందుకు మెంటర్‌షిప్ కార్యక్రమం ద్వారా నిపుణుల మార్గదర్శకత్వం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే విద్యార్థులు సమాజానికి బాధ్యతగల పౌరులుగా, నాయకులుగా ఎదగాలనే లక్ష్యంతో వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించనున్నట్లు వివరించారు.కార్యక్రమంలో స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను పంచుకొని ప్రగతి వెల్ఫేర్ సొసైటీ చేపడుతున్న విద్యా కార్యక్రమాలను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మురళీకృష్ణ, జగదీశ్, శంకర్ ద్యాగా, కార్తీక్, శ్రీకాంత్, ప్రగతి, తులసి, శృతి పాల్గొన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు సురేష్, ఉపాధ్యాయులు శంకర్, శ్రీనివాస్, వజ్రలింగం, లింగం, రాజశేఖర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు.

🌐 Select Language:
📰 ePaper