యూరియా యాప్ రైతులకు శాపంగా మారింది – వెంటనే సవరణలు చేయాలి
పయనించే సూర్యుడు 13 6 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గం లో బీజేపీ భీంగల్ మండల మరియు పట్టణ శాఖల డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ కోసం తీసుకొచ్చిన “యూరియా యాప్” ప్రస్తుతం రైతులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని భారతీయ జనతా పార్టీ భీంగల్ మండల మరియు పట్టణ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహశీల్దార్ కిరణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, యూరియా యాప్ అమలుతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాప్‌లో తక్షణమే మార్పులు చేసి మండలాన్ని యూనిట్‌గా కాకుండా PACS మరియు FACS ఆధారంగా గ్రామ స్థాయిలోనే యూరియా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయని అన్నారు.భీంగల్ మండల అధ్యక్షులు అరే రవీందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా యూరియా యాప్‌ను అమలు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండే యూరియాను యాప్ నిబంధనల కారణంగా పొందలేక రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతులకు సులభంగా ఎరువులు అందే విధంగా యాప్‌లో మార్పులు చేసి, PACS మరియు FACS కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే యూరియా పంపిణీ జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు,చెంగల్ ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,ఉపాధ్యక్షులు మహేందర్,బీజే,వై,ఎమ్ మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్ చంద్,కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు నీలం గంగాదర్,పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్,బీజేపీ నాయకులు కర్క నారాయణ,అరుణ్ నాయక్,ధర్పల్లి మహిపాల్,లింబాద్రి నాయక్,అన్వేష్,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.