అమ్మవారి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలి

May 11, 2026 | సినిమా వార్తలు

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

ఎల్లంపల్లి గ్రామంలో ఎల్లమ్మ,బొడ్రాయి విగ్రహా ప్రతిష్ట మహోత్సవం

ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

(పయనించే సూర్యుడు మే 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ నియోజక వర్గం ఫరక్ నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఎల్లమ్మ,బొడ్రాయి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ బొడ్రాయి ప్రతిష్టాపన గ్రామానికి దిష్టి తగలకుండా, చెడు శక్తులు ప్రవేశించ కుండా రక్షణ కల్పిస్తుందని మనందరి నమ్మకమని ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో గ్రామ ప్రజలకు మంచి జరగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి సర్పంచ్ భవాని సుజాతమల్లేష్, మొగిలిగిద్ద సర్పంచ్ బుగ్గ క్రిష్ణ,మాహదేవ్ పూర్ సర్పంచ్ అనుషా రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్ యాదవ్,వార్డు సభ్యులు బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం, శంకరయ్య గౌడ్, శివ, మల్లేష్, వేణు యాదవ్, ఆనంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

📰 ePaper