కేపీహెచ్బీ కాలనీలో ఘనంగా మందలపు సాయిబాబు చౌదరి 51వ జన్మదిన వేడుకలు
పయనించే సూర్యుడు న్యూస్, మే 15 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : కేపీహెచ్బీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజామనిషిగా గుర్తింపు పొందిన సామాజిక సేవకులు మందలపు సాయిబాబు చౌదరి 51వ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, అనుచరులు, మిత్రులు, స్థానిక ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు పండుగను తలపించాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందజేసి, గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు. బాణాసంచా కాల్చుతూ, నినాదాలతో అభిమానులు సందడి చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, మందలపు సాయిబాబు చౌదరి గత 25 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో నిత్యావసర సరుకుల పంపిణీ, వరదలు మరియు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం, పేదలకు వైద్య సహాయం అందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ స్వయంగా మందలపు సాయిబాబు చౌదరికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, “మందలపు సాయిబాబు చౌదరి ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న నాయకుడు. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమైనవి. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజలకు మరింత చేరువై సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఆయురారోగ్యాలతో నిండి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.అనంతరం అభిమానులు, మిత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రజలు మందలపు సాయిబాబు చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి.