మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ఆదేశంతో రైతులకు అండగా భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
పయనించే సూర్యుడు 156 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : రైతులను ఇబ్బందులకు గుర చేస్తున్న యూరియా యాప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి,యూరియాను విరివిగా రైతులకు అందుబాటులో ఉంచాలి
రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా పంపిణీ యాప్‌ను తక్షణమే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న సులభమైన విధానాన్ని పునరుద్ధరించాలని భీమ్‌గల్ మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొనకంటి నరసయ్య డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు యూరియా యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు అండగా ఉండటానికి సోమవారం భీమ్‌గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా దొనకంటి నరసయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కొత్త కొత్త నిబంధనలతో వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన యాప్ రైతులకు ఉపయోగకరంగా కాకుండా భారంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేమి, సర్వర్ సమస్యలు, యాప్ పనిచేయకపోవడం వంటి కారణాలతో రైతులు గంటల తరబడి ఎరువుల కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.పంటకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా సగానికి కుదించి ఇవ్వడం వళ్ళ రైతుల పంట దిగుబడి ప్రశ్నర్తకంగా మారిందన్నారు.వ్యవసాయ పనులు అత్యంత కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కోసం రైతులు కార్యాలయాలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సి రావడం దురదృష్టకర మన్నారు. రైతు అవసరాలను దృష్టిలో పెట్టకుండా తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రైతు వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. గతంలో KCR ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పొందేవారని, ఇప్పుడు యాప్ పేరుతో అనవసరమైన నిబంధనలు విధించి రైతులను మానసికంగా, ఆర్థికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించడంతో వ్యవసాయ రంగం బలోపేతం అయిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, ఎరువుల పంపిణీని పాత విధానంలో కొనసాగించాలని,రైతులకు యూరియా విరివిగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసారు.లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి పోరాటం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జడ్పీటీసీలు చౌటుపల్లి రవి, కౌన్సిలర్లు బొదిరె నరసయ్య, మల్లెల ప్రసాద్, నాయకులు రాజు నాయక్, మూత లింబాద్రి, సిద్ధపల్లి రాములు, సాగర్, తోట లింగం తదితరులు పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని యూరియా యాప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.