ఎంపీడీవో రాజేశ్వరరావు మండలంలో అకస్మికతనికి

June 17, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూన్ 17 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండలం దొంతికుర్రు & పల్లం గ్రామ పంచాయతీలో జరుగుతున్న వీబీజీ రామ్ జీ (MGNREGs) పనులను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు .కొంతమంది ఉపాధిశ్రామికులకు వేతనం జాప్యం జరుగుతుందన్న విషయంపై తక్షణ చర్యలు చూపి వేతనం సమకూరే విధంగా చర్యలు చూపాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో మస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రాధమిక చికిత్సకి సంబందించిన కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని క్షేత్ర సహాయకులను ఆదేశించారు. వడదెబ్బకు గురి కాకుండా ఉపాధి శ్రామికులు తగు జాగ్రత్తలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.* అనంతరం కాట్రేనికోన మండలం, పల్లం గ్రామపంచాయతీ స్వర్ణ గ్రామాలను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఉదయం 10:00 గంటలకు సందర్శించగా సిబ్బంది అందరూ ఉదయం 9:30 గంటలకే శతశాతం హాజరు నమోదు చేయడంపై ఎంపీడీఓ హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ గ్రామంలో అందించే పౌర సేవలపై ఆరాతీశారు.మరింత బాధ్యతగా పౌర సేవలను ప్రజా నీకానికి అందించాలని, సంపూర్ణ జవాబుదారీతనం వహించాలని స్పష్టం చేశారు.విధుల నిర్వాహణలో అలసత్వం వహించరాదని హితవు పలికారు.సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజానీకానికి మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు.సందర్శనలో పంచాయతీ కార్యదర్శి భాగయ్య & స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper