భైంసా పట్టణంలోని విప్రి కాలనీ లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం

June 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:“కాలనీలోని ప్రతి పౌరుడు… నేర నివారణలో భాగస్వామి కావాలి”జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ దిశానిర్దేశాల మేరకు ఈరోజు భైంసా సబ్ డివిజన్ లోని విప్రీ కాలనీ బైంసా లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించబడింద ఈ కార్యక్రమంలో భాగంగా అనుమతులు లేకుండా నడుపుతున్న (121) ద్విచక్రవాహనాలు,ఒక ఆటోను స్వాధీనం చేసుకొని, సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడమైనది. *ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ మాట్లాడుతూ…సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు,నిషేధిత మత్తు పదార్థాల(గాంజా) వినియోగం, మొబైల్ డ్రైవింగ్,మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ల చేత వాహనాల నడపడం వంటి సామాజిక మలినతలపై విపులంగా వివరణనిచ్చారు.అలాగే ఆస్తి సంబంధ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం అని స్పష్టంగా తెలియజేశారు. అలాగే కాలనీ వారు ముందుకు వచ్చి నేను సైతం లో భాగంగా సిసిటివి కెమెరాలను కాలనీలో ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాలనీ నేషనల్ హైవే కి ఆనుకొని ఉంది కావున కానీ లోపటికి బయటకు వచ్చే ముందు కొద్దిసేపు ఆగి హైవే పైకి వెళ్లవలసిందిగా సూచించినది.ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ తో పాటు, భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్, ఎస్ఐ లు నవనీత్ రెడ్డి, నాగభూషణం, దయాల్ సింగ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది, కాలనీవాసులుటి.సాయి కుమార్ఎస్ హెచ్ ఓభైంసా టౌన్ పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper