అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ నరసింహ ఉక్కుపాదం

టేకుమట్ల చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు నిఘా ప్రతి వాహనంపై క్షుణ్ణ తనిఖీలు: ఎస్పీ నరసింహ ఆదేశాలతో జిల్లాలో అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది.పశువుల అక్రమ రవాణా పిడిఎస్ బియ్యం ఇసుక,వరి ధాన్యం,తరలింపును అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో 24 గంటల పాటు కట్టుదిట్టమైన తనిఖీలు భద్రత కొనసాగుతున్నాయి:
పయనించే సూర్యుడు న్యూస్ మే 12 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 65 పై టేకుమట్ల అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు.చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించి,ప్రతి వాహనాన్ని అనుమానస్పదంగా భావిస్తే పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో అంతర్ రాష్ట్ర అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా పిడిఎస్ బియ్యం ఇసుక,పశువులు,వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా రాత్రింబవళ్లు పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ. రైతులు సంతల నుంచి కొనుగోలు చేసిన పశువులను తరలించే సమయంలో సంబంధిత అనుమతి పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్ ఎస్ఐ బాలు నాయక్ చెక్ పోస్ట్ సిబ్బంది జాతీయ రహదారుల సిబ్బంది పాల్గొన్నారు.