మహిళా మోర్చా బలోపేతానికి కమిటీల ఏర్పాటు

June 27, 2026 | తెలంగాణ

పయ నించే సూర్యుడు జూన్ 27 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) పి.గన్నవరం మండల మహిళా మోర్చా నూతన కమిటీ నియామకం పి.గన్నవరం, జూన్ 26: భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మండల మహిళా మోర్చా కమిటీల నియామక కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం మండల మహిళా మోర్చా నూతన కమిటీని శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మండల మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శ్రీమతి నూకల నాగ వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి కొండ నాగమణిలను నియమించినట్లు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి వై. శకుంతల తెలిపారు.ఈ సందర్భంగా వై. శకుంతల మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాను గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీల నియామకం చేపడుతున్నామని అన్నారు. మహిళలు రాజకీయ, సామాజిక రంగాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళా మోర్చా కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సేవలందిస్తూ మహిళలను మరింతగా సంఘటితం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల ఇంచార్జి శ్రీమతి కుసుమే సునీత, బిజెపి జిల్లా కార్యదర్శి శ్రీమతి మోక ఆదిలక్ష్మి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తోలేటి సుబ్భారావుతో పాటు మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper