50 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన సెయింట్ జాన్స్ విద్యార్థులు
పయనించే సూర్యుడు జూన్ 27 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) 1975-76 విద్యా సంవత్సరంలో అమలాపురం సెయింట్ జాన్స్ హై స్కూల్‌లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాలు ఈరోజు ఘనంగా జరిగాయి.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. వేదిక: అమలాపురంలోని రవణం సూర్యచంద్ర రావు ఫంక్షన్ హాల్
గురువుల సన్మానం: 50 ఏళ్ల క్రితం పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.పాత జ్ఞాపకాలు: క్లాస్‌రూమ్ సంగతులు, స్కూల్ రోజుల జోక్స్, ఆటలు అన్నీ నెమరు వేసుకున్నారు. అందరూ పాత మిత్రులను కలిసి సంతోషంగా గడిపారు.బంగారు పండుగలా జరిగిన ఈ రీయూనియన్ అందరికీ జీవితాంతం గుర్తుండిపోయే రోజు అయ్యింది.