ఎన్యుమరేషన్ ఫామ్స్ అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూన్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ప్రతి ఒక్క ఓటరు బిఎల్వో లకు ఓటర్ వివరాలు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి అన్నారు.ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా శనివారం కొత్తూరు మండలంలోని సిద్దాపూర్,చింతగట్టు తాండ,కొడిచెర్ల,కొడిచెర్ల తాండ,ఇముల నర్వ,ఎస్ బి పల్లి లోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి ఎన్యుమరేషన్ ఫామ్స్ ను అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు సైతం భాగస్వాములయ్యేలా అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫామ్ అందజేయాలని బిఎల్ఓ లను కోరారు.ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ లో మ్యాపింగ్ అయినట్లు అయితే అన్ని వివరాలు సరిచూసుకొని సంతకం చేసి ఫోటోను అంటించి బిఎల్ఓలకు అందజేయాలన్నారు.మ్యాపింగ్ కాని వారు కూడా 2002 ఓటరు జాబితాలో పేరు చూసుకొని ఎనిమినేషన్ ఫామ్ పూర్తిగా నింపి అందజేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్,సర్పంచ్ కొర్ర శాంతి విష్ణు నాయక్,మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవికుమార్ గుప్తా,కొర్ర రవి,బాబు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.