కేంద్ర సహాయ మంత్రి బండి సంజీవ్ కొడుకుని వెంటనే అరెస్టు చేయాలి

May 12, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు 12 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : ఈరోజు మంగళవారం రోజున భీంగల్ మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ తరఫున మండలంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ని వెంటనే భర్తరఫ్ చేయాలని, వారి కుమారుడు బండి భగీరథ సాయి ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదు. రాష్ట్రం లో ఐఏఎస్ భార్యను చంపితే, నడిరోడ్డుపై యువకులు చంపితే, మిట్ట మధ్యాహ్నం బంగారు దుకాణంలో దొంగతనం జరిగితే, మైనర్ అమ్మాయిని మానభంగం చేస్తే ఏమి చేయని రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. దేశంలో ప్రధానమంత్రి మోడీ బేటి బచావో బేటి పడావో అని నినాదాలు ఇస్తూ తెలంగాణలో మాత్రం మైనర్ అమ్మాయిని అత్యాచారం చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని బిజెపి నాయకులు రాష్ట్రంలోని పోలీసులు బండి భగీరథ మూడు రోజుల నుంచి ఆఫ్ స్టాండింగ్లో ఉన్నాడని చెబుతున్నారు పోక్స్ కేసు రిజిస్టర్ అయిన రెండు రోజులకు కూడా బండి భగీరథ సాయి ని అరెస్టు చేయకపోవడం పోలీసుల పనితీరును సూచిస్తుంది కేంద్రంలోని బిజెపి సర్కార్ లోని ప్రధానమంత్రి మోడీ బడే మియా గారు రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లోని సీఎం రేవంత్ రెడ్డి చోట మియా గారు తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలుపరచకుండా అధికారం,డబ్బు ఉన్న వారికి ఒక న్యాయం సాధారణ వ్యక్తులకు, బీదవారికి ఒక న్యాయం చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు కలిసి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి ప్రజలు ఇట్టి విషయాన్ని గ్రహించాలని బిఆర్ఎస్ భీమ్గల్ మండల నాయకులు కూర్చున్నారు. బిజెపి నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి భర్తల చేయాలని కోరుచున్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు ఉన్నా బండి సంజయ్ కొడుకు బండి భగీరథను వెంట్రు అరెస్ట్ చేయాలని కోరుచున్నాము బండిసంజయ్,అతని కుమారుడు బండి భగీరథ సాయి యొక్క దిష్టిబొమ్మలు కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్,మాజీ జెడ్పి కోఆప్షన్ మెంబెర్ మొయిజ్, సొసైటీ చైర్మన్ శివ సాయి నరసయ్య, భీమ్గల్ మున్సిపల్ కౌన్సిలర్లు మల్లెల ప్రసాద్, బుదిరె నర్సయ్య, నీలం రవి, మాజీ కౌన్సిలర్లు మూత లింబాద్రి,సతీష్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు పర్స నవీన్, మాజీ సర్పంచులు రాములు, అజిజ్, నర్సింహా చారి, మాజీ ఎంపీటీసీలు సృజిల్,సాయి బి ఆర్ ఎస్ నాయకులు బాబాపూర్ శ్రీనివాస్, రాజునాయక్, ఇక్రమ్,అవినాష్,ముతేన్న, సురేష్, సాగర్, మొదలగు వారు పాల్గొన్నారు

📰 ePaper